వందనమయ్యా వినాయక
పంచ హస్త ప్రధమ పూజ్య పార్వతి ప్రియ నమో నమో
పంచ హస్త ప్రధమ పూజ్య పార్వతి ప్రియ నమో నమో
విఘ్నరాజా విశ్వ నేత్ర విరాట్పతియే నమోనమో
వినాయక జయ నమోనమో
లంబోదర జయ నమోనమో
నలుగు చేసిన తపసు ఏమిటో
నలిపి మాత నీ ప్రతిమ చేసెనే
నలిపి మాత నీ ప్రతిమ చేసెనే
గజము చేసిన పుణ్యము ఏమిటో
గణనాధా ముఖముగా ప్రసిద్ధి పొందేనే
వినాయక జయ నమో నమో
లంబోదరా జయ నమో నమో
మూషికముని విలువ పెంచి
మోయు వరముని ఇచ్చినావు
అల్ప గరికైనను భక్తి మెచ్చి
అడిగిన వరము ఇచ్చినావు
వినాయక జయ నమో నమో
లంబోదర జయ నమో నమో
ఫాల చంద్రనికి శాపం ఇచ్చి
పరిహాసించుట కండించినావు
ఆరుముగముని ఆట గెలిచి
అగ్రస్థానం పొందినావు
పరిహాసించుట కండించినావు
ఆరుముగముని ఆట గెలిచి
అగ్రస్థానం పొందినావు
వినాయక జయ నమో నమో
లంబోదరా జయనమో నమో
పసుపుతో నిన్ను చేస్తే పరమ తృప్తి పొందుతావు
బెల్లము నీకు పెడితే బాధలన్నీ తరుముతావు
నారికేళం నీకు కొడితే నా కోరికలు తీరుస్తావు
వంగి గుంజి నీకు పెడితే వెలుగు మార్గం చూపుతావు
వినాయక జయ నమో నమో
లంబోదర జయ నమో నమో
ఎంత పెద్ద యాగమైన ఎంత చిన్న కోరికైనా
ఎలుక వాహనుడికే ప్రధమ స్థానముకదా
లంబోదరా జయనమో నమో
పసుపుతో నిన్ను చేస్తే పరమ తృప్తి పొందుతావు
బెల్లము నీకు పెడితే బాధలన్నీ తరుముతావు
నారికేళం నీకు కొడితే నా కోరికలు తీరుస్తావు
వంగి గుంజి నీకు పెడితే వెలుగు మార్గం చూపుతావు
వినాయక జయ నమో నమో
లంబోదర జయ నమో నమో
ఎంత పెద్ద యాగమైన ఎంత చిన్న కోరికైనా
ఎలుక వాహనుడికే ప్రధమ స్థానముకదా